మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండల శివారులో వున్న భద్రకాలి అమ్మవారిని భక్తులు దాదాపుగా 60 సంవత్సరాలుగా భక్తి శ్రద్దలతో కొలుస్తున్నారు.ఇంతవరకు ఆలయం అభివృద్ధికి నోచుకోలేదని ఆలయ ఆర్చకులు వెన్నప్ప సంతోష్ శర్మ చెప్పడం జరిగింది. ఆలయ పూజారి వివరాల ప్రకారం..భద్రకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్టించి 60 సంవత్సరాలు అవుతుందని,భక్తుల సహకారంతో ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు.సుమారు 60 సంవత్సరాల క్రితం వడ్డరి కూలీలు రోడ్డు పనులలో గడ్డపారలతో బండలను తొలగిస్తూ ఈ భద్రకాలి అమ్మవారి విగ్రహంను గమనించి మట్టిలో నుండి బయటకు తీసి రోడ్డు పక్కన చెట్ల మధ్యలో ప్రతిష్ట చేశారని చెప్పడం జరిగింది. క్రమేపి ఈ ఆలయాన్నిదాతల సహకారం తో కొంత మేరకు అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.గుడిలో శాంతులు, ప్రతీ అమావాస్య కు అమ్మవారి ప్రత్యేక పూజలు, దసరా, విజయ దశమి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు.
అయ్యప్ప స్వామి భక్తులు కూడా అమ్మవారి దర్శనం కొరకు వస్తూ వుంటారని అన్నారు.అమ్మవారికి ప్రతి రోజు శాస్త్ర యుక్తంగా దూప దీప నైవేద్యాలతో శక్తి మేరకు భక్తులు ఇచ్చే కానుకలతో భద్రకాళి అమ్మవారికి పూజలు చేస్తున్నానని చెప్పడం జరిగింది.కాని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో నిత్య పూజలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని,ఎలాంటి జీతబత్యాలు లేకున్నా ప్రతి రోజు అమ్మవారికి తనే స్వచ్చందంగా పూజలు చేస్తున్నానని తెలియచేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు దేవాదాయ శాఖ నుండి నిధులు మంజూరు చేయించి తొర్రూర్ భద్రకాళి దేవాలయం అభివృద్ధికి తొడ్పడాలని అర్చకులు ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలో తెచ్చి, ఆలయ అర్చకునికి నెల కు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని దేవాలయం పూజారి సంతోష్ శర్మ కోరడం జరిగింది.