బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆ దేశ జాతీయ పతాకాన్ని మంగళవారం మెట్ పల్లి పట్టణంలోని శాస్త్రి విగ్రహం వద్ద దహనం చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ హుస్సేన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీలకతీతంగా హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని నిరసనకారులు కోరారు.
హిందువుల భద్రత కోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్, హిందూ జాగృతి నాయకులు పోహార్ తుకారాం, గుంటుక గంగాధర్, గట్టడి విజయ్, ఇల్లెందుల కృష్ణమాచారి, గుంటుక సదాశివ్, కొల్లెం శ్రీనివాస్, బెజ్జారపు మురళి, తోకల సత్యనారాయణ, మాధవన్, నిర్మల్ శ్రీనివాస్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.