ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను విని వారికి పరిష్కార మార్గం చూపారు.