బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అల్లూరి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం అనంతగిరి మండలంలో అత్యధికంగా 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గూడెం కొత్తవీధి 5.8, చింతపల్లి 3.9, హుకుంపేట 3.3, కొయ్యూరు 2.5, డుంబ్రిగుడ, జీ.మాడుగుల 2.0, పాడేరు 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు.