ఉలవపాడు రైతు సేవా కేంద్రం -3 లో గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులకు సూక్ష్మ, సేద్య పథకాలు, ప్రభుత్వ రాయితీలపై ఉద్యాన అధికారి బి. జ్యోతి, వ్యవసాయ అధికారి బి. తిరుమల జ్యోతి అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
బిందు, తుంపర్లు నీటి సాగు పథకాలపై రైతులను ప్రోత్సహించాలని రిజిస్ట్రేషన్ లు వేగవంతం చేయాలని తెలిపారు. రబీ ఈ- క్రాఫ్ మీద రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని ఆమె సూచించారు.