12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా యూపీలోని ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కుంభమేళాలో సుమారు 400 కోట్ల మంది ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కాగా మిగిలిన పనులపై యోగీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏర్పాట్లను ఇటీవల పీఎం ప్రధాని సైతం పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా రైల్వే శాఖ ఇప్పటికే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.