అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్నాయి. ఈ క్రమంలో తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘కొంతమందికి అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు. ఆయన భారత్ పౌరులందరికీ స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన సాటిలేని రాజకీయ మేధావి. ఆయన అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి. ఆయన పేరు పలికితే మనసు, పెదాలకు సంతోషంగా ఉంటుంది’ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.