నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో నేడు, రేపు ఎన్నికలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ ఎం. సుభద్ర తెలిపారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు.
బూత్ లెవెల్ అధికారులు పాల్గొని ఫారం 7, 8, 9 అందుబాటులో ఉంచుకొని కొత్తవారి నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించాలన్నారు.