భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు మేలు చేసిందన్నారు.