జనసేన న్యాయ విభాగానికి సంబంధించి తాజాగా కీలక నియామకం జరిగింది. జనసేన పార్టీ జనరల్ కౌన్సిల్ గా న్యాయవాది ఎన్. అశ్వనీ కుమార్ ను నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన నుంచి ఓ ప్రకటన వెలువడింది. పార్టీకి అవసరమైన లీగల్ వ్యవహారాలను అశ్వనీ కుమార్ పర్యవేక్షిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అశ్వనీ కుమార్ కు ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో అనేక కేసులు వాదించిన అనుభవం ఉందని జనసేన వెల్లడించింది. జనసేన పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా న్యాయ పరమైన సేవలు అందిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది.