మీరు రోజూ సుమారు రెండున్నర గంటల పాటు నడుస్తున్నారా? అయితే, మీ జీవిత కాలం మరో 11 ఏళ్లు పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండున్నర గంటలకు పైగా నడిచే వారిలో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం తగ్గిపోయినట్లు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అధ్యయనంలో వెల్లడైంది. తక్కవ శారీరక శ్రమ చేసే వారిలో గుండె జబ్బులు వస్తాయని, అకాల మరణం సంభవించే అవకాశం ఎక్కువని పరిశోధకులు అంటున్నారు.