అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2,646 డాలర్లు ఉండగా.. గురువారం నాటికి 35 డాలర్లు తగ్గి 2,611 డాలర్లకు చేరుకుంది.ప్రస్తుతం ఔన్స్ వెండి ధర 29.40 డాలర్లుగా ఉంది. దీంతో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 710 తగ్గింది. మరోవైపు కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత తగ్గాయో ఓసారి పరిశీలిద్దాం..
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,700కు చేరగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.77,130 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,850 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 77,280.ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.70,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.77,130.చెన్నైలో 22 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 70,700 కాగా.. 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 77,130 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా ..
దేశవ్యాప్తంగా గురువారం వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.99,000 కు చేరింది.దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..చెన్నైలో కిలో వెండి ధర రూ. 99,000.కోల్ కతా, ఢిల్లీ, ముంబయి నగరాల్లో కిలో వెండి ధర రూ. 91,500.బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,500 వద్ద కొనసాగుతుంది.పైనపేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం నమోదైనవి. ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.