గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవిందరావుతో కలిసి మంత్రి సవిత వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.