బాపట్ల పట్టణం లో ఉన్న అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, మున్సిపల్ సిబ్బందితో వెళ్లి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పేద ప్రజలకు రూ. 5 కే అందిస్తున్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్ లో పరిశుభ్రమైన ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందితో కలిసి భోజనం చేశారు.