క్రీడలు ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని ఆరోగ్యంగా జీవించాలని టిడిపి యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కొరకు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా టి. బలిజపల్లి యువతకు 25 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతో పాటుగా క్రీడలలో కూడా రాణించాలని కోరారు.