2024 సంవత్సరం మరో వారం రోజుల్లో ముగియనుంది. క్రికెట్ ప్రపంచంలో ఈసారి భారత్ బిజీ బిజీగా గడిపింది. అయితే ఈ ఏడాది భారత క్రికెటర్లలో పలువురు ప్రధాన ఆటగాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పేశారు. ఇందులో రవిచంద్రన్ అశ్విన్, దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. పలువురు విదేశీ ప్లేయర్లు సైతం ఈ ఏడాదితో తమ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశారు.. వాళ్లు ఎవరంటే..!
రవిచంద్రన్ అశ్విన్:
గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తన టెస్టు కెరీర్లో 106 మ్యాచులు ఆడిన అశ్విన్.. 537 వికెట్ల తీశాడు. ఈ టెస్టులతో పాటు 116 వన్డేలు, 65 టీ20లు కలిపి అశ్విన్ 619 వికెట్లు పడగొట్టాడు.
జేమ్స్ అండర్సన్:
లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 2024 జులై 12 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20లు ఆడిన అండర్సన్ మొత్తంగా 991 వికెట్లు పడగొట్టాడు.
దినేశ్ కార్తిక్:
జూన్ 1న తన పుట్టిన రోజు సందర్భంగా ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు భారత వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల కెరీర్లో దినేశ్ కార్తిక్ 169 ఇన్నింగ్స్‌లలో భారత్ తరఫున 3,463 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్:
క్రికెట్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డేవిడ్ వార్నర్.. 2024 జనవరి 6న పాకిస్థాన్‌తో సిడ్నీలో జరిగిన టెస్టుతో తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డేలకు, టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత టీ20లకు కూడా అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్ తరఫున 474 ఇన్నింగ్స్‌లలో వార్నర్.. 18,995 రన్స్ చేశాడు.
శిఖర్ ధావన్:
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. ఆగస్టు 24న దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున చివరగా అతడు 2022 డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి.. 288 ఇన్నింగ్స్‌లలో ధావన్.. 10,867 పరుగులు స్కోరు చేశాడు.
టిమ్ సౌథీ:
న్యూజిలాండ్ వెటరన్ పేసర్.. టిమ్ సౌథీ.. ఈ నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 17 ఏళ్ల కెరీర్లో కివీస్ తరఫున 17 టెస్టులు, 161 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 776 వికెట్లు తీశాడు.
మొయిన్ అలీ:
ఇంగ్లాండ్ ప్లేయర్ మొయిన అలీ కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు ఏ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్ తరఫున 305 ఇన్నింగ్స్‌లలో 6678 పరుగులు.. 366 వికెట్లు తీశాడు.