సుప్రసిద్ధ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. కళాత్మక దృష్టితో వాస్తవిక జీవిత ఘటనలను అద్భుతమైన దృశ్యకావ్యాలుగా ప్రేక్షకులకు చూపించారని కొనియాడారు. పాల విప్లవంపై తీసిన మంథన్ సినిమా తనకెంతో స్ఫూర్తినిచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. కాగా ... శ్యామ్ బెనగళ్ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా దూరదర్శన్ సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976), భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.
ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగస్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.