దర్శకుడు రాంగోల్‌వర్మకు కోటి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. రాంగోల్‌వర్మకు నోటీసులు ఇచ్చి డబ్బు చెల్లించేందుకు 15 రోజులు సమయం ఇచ్చామని గుర్తుచేశారు. నిర్ణీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జగన్ ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్‌లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని జీవీరెడ్డి స్పష్టం చేశారు.న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.