మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి.పెద్దగా ధర కూడా ఉండవు. అందువల్ల ఈ పండ్లను అందరూ తింటుంటారు. అయితే దానిమ్మ పండ్లను రోజూ తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. రక్తహీనతను తగ్గించడంలో ఈ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అనేక పోషకాలు కూడా ఈ పండ్లలో ఉంటాయి. విటమిన్లు బి, సి ఉంటాయి. ఇవి మనల్ని రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి. దానిమ్మ పండ్లలో మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. అయితే దానిమ్మ పండ్లను తినడం వల్ల మనకు ప్రయోజనాలతోపాటు నష్టాలు కూడా ఉంటాయి.ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండ్లను తినకూడదు. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి కణాలను దెబ్బతినకుండా చూస్తాయి. అలాగే ఈ పండ్లను తినడం వల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్‌తో బాధపడేవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దానిమ్మ రసం తీసుకోవాలి. ఇది క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
అల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే దానిమ్మ పండ్లను రోజూ తినాలి. అల్జీమర్స్ రాకుండా చేయడంలో దానిమ్మ పండ్ల విత్తనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మ పండ్లను తినడం వల్ల పేగుల్లో మంట తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అయితే విరేచనాల సమస్య ఉన్నవారు మాత్రం దానిమ్మ పండ్లను తినరాదు. ఇక కీళ్ల నొప్పులు, ఇతర ఆర్థరైటిస్ నొప్పులకు దానిమ్మ రసం ఉపయోగంగా ఉంటుంది. దానిమ్మ రసం గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.
హైబీపీ ఉన్నవారు, షుగర్ వ్యాధిగ్రస్తులు రోజూ దానిమ్మ రసాన్ని తాగడం వల్ల ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక దానిమ్మ తినడం వల్ల కొందరికి అలర్జీలు వంటివి రావచ్చు. కనుక వారు దానిమ్మ పండ్లను తినడం మానేయాలి. అలాగే లో బీపీ, లో షుగర్ సమస్యతో బాధపడేవారు కూడా దానిమ్మ పండ్లను తినకూడదు. ఇక దానిమ్మ పండ్లను అధికంగా తింటే పేగుల్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో విరేచనాలు కూడా కావచ్చు. ఇక ఈ పండ్లను తినడం వల్ల వికారం, వాంతులు, కడుపు నొప్పి, మలబద్దకం వంటి సమస్యలు వస్తే వెంటనే వీటిని తినడం ఆపేయాలి. ఇలా దానిమ్మ పండ్లను కొందరు తినకూడదు, కొందరు తినవచ్చు, ఈ విషయాలను తెలుసుకుని ఈ పండ్లను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తప్పవు.