చాలా మంది ఆరోగ్య నిపుణులు మొలకెత్తిన గింజలు తినమని చెబుతూ ఉంటారు. ఆ మొలకెత్తిన గింజలు తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతుంటారు.వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయని చెబుతుంటారు. కానీ చాలా మంది వీటిని తినడం మానేస్తుంటారు. అయితే ఈరోజు ఈ మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీరానికి ఏ విధంగా మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఏమేమి ఉంటాయంటే?
ఈ మొలకెత్తిన గింజల్లో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో సులభంగా జీర్ణమవుతాయి. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలను తక్షణమే అందే విధంగా చేస్తాయి. అలాగే ఇందులో ఆల్కలైజ్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే శరీరంలో అన్ని భాగాలకు కావాల్సిన అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి.సాధారణ గింజలతో పోలిస్తే మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పెసలు, మినుములు, శనగలు, చిక్కుడు గింజలను మొలకెత్తించి తినడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
చర్మ సౌందర్యానికి
మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చర్మం కాంతివంతంగా మారడానికి, చర్మంపై ముడతలు రాకుండా ఉండడానికి, చర్మంపై ఉండే మచ్చలు పోవడానికి ఇది సహాయపడుతుంది. ప్రతిరోజూ మొలకెత్తిన గింజలు తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. కచ్చితంగా కాంతివంతంగా సినిమా యాక్టర్ల చర్మం మాదిరిగా మెరిసిపోతుంది.
శృంగారంలో కూడా కింగ్..
మొలకెత్తిన గింజల్లో విటమిన్ ఈతో పాటు విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది శృంగార సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయి. వంధ్యత్వం పోగొట్టడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంగం గట్టిపడడానికి, ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనడానికి ఈ మొలకెత్తిన గింజలు చాలా ఉపయోగపడతాయి. శృంగారంలో వీక్‌గా ఉన్న వ్యక్తులు ఈ మొలకెత్తిన గింజలను తినడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది.
బరువు తగ్గడానికి..
ఈ మొలకెత్తిన గింజల్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది సులభంగా కడుపులో జీర్ణమైపోతుంది. అలాగే చాలాసేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా వెంటనే ఆకలి వేయదు. అలాగే బరువు తగ్గేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కూడా ఈ మొలకెత్తిన గింజలు తొలగిస్తాయి. దీంతో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. అలాగే గుండె జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ మొలకెత్తిన గింజలను మీ డైట్‌లో భాగం చేసుకోండి.