నేటికాలంలో అధిక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీంతో బరువు తగ్గాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా కడుపుచుట్టూ ఉండే కొవ్వు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు.ఎందుకంటే పొట్ట కొవ్వును తగ్గించడం అంత సులభం కాదు. నడుం చుట్టూ కొవ్వు చేరడం వల్ల శరీరంలోని కాలేయం, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాలపై దీని ప్రభావం పడుతుంది.అందుకే బెల్లీ ఫ్యాట్‌ని వెంటనే తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు కూడా అధిక బరువుతో బాధపడుతున్నట్లయితే, దానిని తగ్గించుకోవడానికి సులభమైన మార్గాలు నిపుణుల మాటల్లో మీ కోసం.ఉదయం అల్పాహారం ఎక్కువగా తినకూడదు. లైట్‌గా తీసుకోవాలి. ముఖ్యంగా అల్పాహారంలో తృణధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని తీసుకోవడం ద్వారా చాలా వరకు బరువు తగ్గవచ్చు. నట్స్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోజంతా కుడపు నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ ఆకలి అనిపించదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందుకే అల్పాహారంలో బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, ఎండుద్రాక్షలను చేర్చుకోవచ్చు.అలాగే ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో సీజనల్ ఫ్రూట్‌లను చేర్చుకోవాలి. దానితో పాటు మీకు నచ్చిన పండ్లను ఎంచుకోవచ్చు. అయితే ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లను ఎంచుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆపిల్, దానిమ్మ బెస్ట్ ఆప్షన్.బరువు తగ్గడానికి ఆహార పదార్థాలను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మీ ఆహారంలో చక్కెర, తెల్ల ఉప్పు, మైదా వంటి పదార్థాలతో తయారు చేసిన ఆహారాలను పూర్తిగా నివారించాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. వేగంగా బరువు తగ్గవచ్చు.