ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలబద్ధకం సమస్య నుంచి ఇలా ఉపశమనం పొందండి

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 02:30 PM

నేటి ఆధునిక యుగంలో చాలామందిని వెంటాడే సమస్య మలబద్ధకం. దీర్ఘకాలిక మలబద్ధకం కొన్ని వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఉండే మలాన్ని విసర్జించడంలో ఏర్పడే సమస్యనే మలబద్ధకం అంటారు.దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్నవారు మలవిసర్జనకు ఎక్కువగా శ్రమ పడవలసివస్తుంది. మలబద్ధకం అనేక కారణాలను కలిగి ఉంటుంది. ఈ మాలబద్ధక సమస్యనే ఆయుర్వేదంలో ఆనాహము అని పిలుస్తారు. ఏ వ్యక్తి అయితే మలబద్దకం సమస్యను ఎదుర్కొంటారో వారికీ నడుము, వీపు నందు నొప్పి కలిగి ఉండటం, కడుపునొప్పి, ఆయాసము, ముఖములో మొటిమలు, దద్దుర్లు, వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక, జలుబు, శిరస్సు నందు మంట, రొమ్ము పట్టినట్లు ఉండటం, తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు మరికొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య అనేది పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలను ఎదుర్కొంటాడు .మరి ఇలాంటి సమస్య నుంచి బయటపడాలి అంటే ఆయుర్వేద నిపుణులు మీ ఆహారంలో ఈ నాలుగు పదార్థాలను చేర్చుకుంటే చాలు మనబద్ధక సమస్యకు గుడ్ బై చెప్పవచ్చని వెల్లడిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మలబద్ధక సమస్యను తగ్గించే ఆ నాలుగు అద్భుతమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధక సమస్యను నివారించే అతి ముఖ్యమైన మసాలా దినుసు అల్లం. మెరుగైన జీర్ణక్రియ ప్రేరేపించి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఉదయం ఆహారంగా అల్లం టీలో జోడించి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య అనేది నియంత్రణలోకి వస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ ప్రేగులలోని మలాన్ని సాఫీగా బయటికి రావడానికి సహాయపడుతుంది.


 


అదేవిధంగా ఆపిల్ పండులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారం జీర్ణం కావడాన్ని సులభతరం చేస్తుంది. దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అదనంగా, యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబ్బట్టి ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. అంజీరా మరియు నల్ల ఎండు ద్రాక్షని రాత్రిపూట నానబెట్టి, ఉదయం ఈ సూపర్‌ఫుడ్‌ను తీసుకోవడం మంచిది. ఈ రెండింటిలో మంచి మొత్తంలో ఫైబర్ మరియు పిండి పదార్థాలు ఉన్నాయి. ఇవి ప్రేగులను ఆరోగ్యకరంగా తయారు చేయడంతో పాటు మలబద్ధక సమస్యలు నియంత్రిస్తుంది.


మీ ఆరోగ్యవంతమైన జీర్ణాశయానికి జొన్నలు ఆహారంలో జోడించడం చాలా మంచిది. ఇది గ్లూటెన్ రహితం. అధిక ప్రోటీన్, సూక్ష్మపోషకాలు, ఐరన్ మరియు మరెన్నో పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా సహకరిస్తాయి. మీకు అజీర్ణం మరియు మలబద్ధకం ఉన్నట్లయితే ఆవు నెయ్యితో జొన్న రొట్టెను తయారు చేసుకోవడం తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది.ఇక చివరిగా చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మీ ప్రేగులు పనితీరు అద్భుతంగా ఉంటుంది. గోరు వెచ్చని నీరు త్రాగడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మీ శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మల బద్ధక సమస్యతో బాధపడేవారు ఉదయం గోరువెచ్చని నీటిని త్రాగవచ్చు మరియు రాత్రి మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు ఉత్తమంగా పనిచేస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేయడానికి మీ ఆహారంలో ఈ ఆహార పదార్థాలను చేర్చుకోండి అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com