రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలామంది కాఫీ లేదా టీ తాగుతుంటారు. అయితే కాఫీని అసలు రోజుకు ఎన్ని కప్పుల వరకు తాగితే మంచిది? అన్న విషయానికి వస్తే.. వైద్యులు చెబుతున్న ప్రకారం రోజుకు 2- 3 కప్పుల వరకు కాఫీని సేవించవచ్చు. అంతకు మించితే మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.కాఫీలో కెఫీన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది హృదయ సంబంధిత సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. కాఫీలో పలు పోషకాలు కూడా ఉంటాయి. మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ ఇ తదితర పోషకాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాఫీలో ఉంటాయి. కాఫీలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూస్తుంది. అలాగే పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది. దీంతోపాటు గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. కాఫీని రోజూ మోతాదులో తీసుకుంటేనే ఈ లాభాలను పొందగలుగుతారు. అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కాఫీని తాగడం వల్ల ఆందోళన, కంగారు వంటి సమస్యలు కూడా తగ్గుతాయట. ఈ మేరకు ఫరీదాబాద్‌లోని ఏషియన్ హాస్పిటల్ హెడ్ డైటిషియన్ కోమల్ మాలిక్ చెప్పారు.
కాఫీని తాగడం వల్ల మన మూడ్ కూడా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్ లేదా మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు కాఫీ తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. కాఫీని తాగడం వల్ల మైండ్ రిలాక్స్ అయి మూడ్ మారుతుంది. అలాగే కాఫీలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఇక బరువు తగ్గాలనుకునేవారు కూడా కాఫీని తమ దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇక కాఫీని అసలు రోజుకు ఎన్ని కప్పుల వరకు తాగితే మంచిది..? అన్న విషయానికి వస్తే.. వైద్యులు చెబుతున్న ప్రకారం రోజుకు 2 నుంచి 3 కప్పుల వరకు కాఫీని సేవించవచ్చు. అంతకు మించితే మాత్రం ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక కాఫీని రోజూ నిర్దేశించిన మోతాదులోనే తాగాల్సి ఉంటుంది.