కాకరకాయలు అంటే సహజంగానే చాలా మందికి ఇష్టం ఉండవు. వీటిని తినేందుకు అందరూ అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. కాకరకాయలతో మనం తరచూ పలు రకాల వంటలను చేస్తుంటాం. వేపుడు, టమాటాలతో కలిపి వండుకోవడ లేదా పులుసు పెట్టుకోవడం చేస్తుంటాం. అయితే వాస్తవానికి డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. షుగర్ ఉన్నవారు కచ్చితంగా రోజూ కాకరకాయలను తినాల్సి ఉంటుంది. అయితే వీటిని తినడం ఇష్టం లేకపోతే కనీసం జ్యూస్ రూపంలో అయినా తాగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాకరకాయ డయాబెటిస్‌ను అదుపు చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందని వారు అంటున్నారు.కాకరకాయల్లో చరాంతిన్ అనే సహజసిద్ధమైన స్టెరాయిడ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాకరకాయల్లో ఓలినాలిక్ యాసిడ్ గ్లూకోసైట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. క్లోమగ్రంథి ఇన్సులిన్‌ను సరిగ్గా ఉత్పత్తి చేసేలా చేస్తాయి. దీని వల్ల రక్తంలో ఉన్న షుగర్ లెవల్స్ తగ్గుతాయి. కనుక కాకరకాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా రోజూ వీటిని తింటే ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. కాకరకాయ జ్యూస్‌ను రోజూ 30 ఎంఎల్ మోతాదులో తాగినా చాలు షుగర్ లెవల్స్‌ను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఉన్న అధిక చక్కెర స్థాయిలను మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ కాకరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి.
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు రోజూ కాకరకాయను తింటుంటే ఫలితం ఉంటుంది. శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) తగ్గిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవచ్చు. కాకరకాయల్లో అనేక రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి. ఈ విటమిన్ల లోపంతో బాధపడుతున్నవారు రోజూ కాకరకాయ జ్యూస్‌ను తాగితే ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల కిడ్నీలు క్లీన్ అవుతాయి. కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీని వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కిడ్నీల్లో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి బయట పడవచ్చు.