చలికాలంలో నారింజ పండ్లు తినడం చాలా మంచిది. నారింజలోని విటమిన్-సి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఊపిరితిత్తులలోని కఫాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. చలికాలంలో ఈ పండ్లు తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.