హిందువులు ఆధ్యాత్మికమైన విషయాల్లో చాలా శ్రద్ద చూపుతారు. పండుగలకు.. విశేషమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక ఏకాదశి రోజుల్లో విష్ణు సంబంధమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే వేరే చెప్పనక్కరలేదు. ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 10న వచ్చింది. ఆరోజున దాదాపు ప్రతి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. అంతే కాదు దగ్గరలో పుణ్య నదులు ఉంటే వాటిలో స్నానమాచరిస్తారు. అలా చేస్తే కోటి పుణ్యాల ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.
సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్య కాలానికి ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పండితులు చెబుతున్నారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఆ రోజున అంటే 2025 జనవరి 10 వ తేదీన వైష్ణవ సంబంధ ఆలయాల్లో తెల్లవారుజామునే ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటారు.పురాణాల ప్రకారం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలను తీరుస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏరాదశులతో సమానమని పండితులు చెబుతారు. క్షీర సముద్రాన్ని మథించేటప్పుడు .. ఈ రోజునే హాలాహలం.. అమృతం పుట్టాయ ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. పరమేశ్వరుడు.. హాలాహలం మింగి కంఠం దగ్గర ఉంచుకోగా... అమృతాన్ని దేవతలు అందరూ పంచుకున్నారు. అప్పటి నుంచి పరమేశ్వరుడి నీలకంఠేశ్వరుడు అని కూడా పిలవడం మొదలు పెట్టారు.