ప్రపంచవ్యాప్తంగా మద్యపానం చేసేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే, ఈ మద్యపానం క్యాన్సర్‌కు ప్రధాన కారణమవుతుందని తాజాగా భారతీయ సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి పేర్కొన్నారు.
ముఖ్యంగా అమెరికన్ వినియోగదారులు కొనుగోలుచేసే మద్యం బాటిళ్లలపై ‘మద్యపానం క్యాన్సర్‌కు కారకం’ అని ముద్రించాలని ప్రతిపాదించారు. మద్యపానం కారణంగా ఏటా సుమారు 20 వేలమంది క్యాన్సర్ బారినపడి మరణిస్తున్నారని వెల్లడించారు.