అమెరికాలోని మెంఫిస్ పట్టణంలో ‘డయ్యర్స్ బర్గర్స్’ అనే ఫేమస్ రెస్టరెంట్ వందేళ్లుగా ఒకే వంటనూనెను మళ్లీ మళ్లీ వాడి బర్గర్స్‌ను తయారుచేస్తోంది.
పైగా బర్గర్ రుచికి ఇదే రహస్యమంటూ చెప్పుకొస్తున్నారు. దీనిని 1912లో ఎల్మెర్‌డాక్ స్థాపించాడు. ఒకరోజు అతను నూనెను మార్చకుండా బర్గర్ తయారు చేయడంతో..ఓ కస్టమర్ ఎంతో రుచికరంగా ఉందని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన అవసరానికి నూనె కలుపుతూ..వాటిని తయారుచేస్తున్నాడు.