భారత్‌లో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్(HMPV)కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనిని ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.