చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతో పాటు పలు దేశాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ క్రమంలో భారత్‌లో 3 HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి.
దీంతో కార్పొరేట్ కార్యాలయాలతో పాటు, రద్దీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. మాస్క్ కచ్చితంగా ధరించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని..సామాజిక దూరాన్ని పాటించాలని వైద్యులు సూచించారు.