చైనాలో పుట్టిన ‘కరోనా’ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనాలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో వచ్చేందుకు టైమ్ పడుతుందని అందరూ భావించారు. కానీ అవే లక్షణాలతో బెంగళూరులో 8 నెలల చిన్నారి ఆస్పత్రిలో చేరింది. కాబట్టి ఇప్పటి నుంచైనా బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించండి. గుంపు గుంపులుగా తిరగకండి. షేక్ హ్యాండ్ ఇవ్వకండి. ఆహారం తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి.