సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నేపథ్యంలో విజేత జట్టులోని.
ఆటగాళ్లందరికీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించనున్నట్లు ప్రకటించింది. అలాగే జట్టులోని మొత్తం 22 మంది ప్లేయర్లకు రూ.50 లక్షల నజరానా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.