HMPV వైరస్ పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తొలిసారిగా స్పందించింది. HMPV(హ్యూమన్ మెటాప్యూమో వైరస్) కొత్తదేమి కాదని పేర్కొంది. దీనిని 2001లోనే గుర్తించామని WHO తెలిపింది.
HMPV వైరస్ ప్రభావం శీతాకాలంలో పెరుగుతుందని వివరించింది. శ్వాసకోశ ఇబ్బంది, సాధారణ జలుబు వంటి లక్షణాలు ఉండవచ్చు అని చెప్పింది. వైరస్ పట్ల అంతగా ప్రజలు భయాందోళన చెందవద్దని..ఇది సాధారణ వైరస్ మాత్రమేనని ప్రకటించింది.