ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ మొక్క ఏంటో తెలుసా.. ? తెలియక పోతే వెంటనే దీని ప్రయోజనాలు తెలుసుకోండి...

Life style |  Suryaa Desk  | Published : Sat, Jan 11, 2025, 11:30 AM

పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఇది తెలుసుకోండి..ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది పారిజాతం చెట్టును ఇంటిలో పెంచుకుంటున్నారు. పారిజాతం చెట్టు మొత్తంను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పారిజాతం పువ్వు దేవత ఆరాధనలో మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పారిజాతం పువ్వు గురించి మనలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి ముందుగా వాటి గురించి తెలుసుకున్నాక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఒలేసియే కుటుంబానికి చెందిన పారిజాతం పువ్వులు మంచి సువాసనగల తెల్లని పువ్వుల చెట్టు. ఇది అక్టోబరు, నవంబరు, డిసెంబరు మాసాలలో విరివిగా పుష్పిస్తుంది. ఈ పువ్వులు రాత్రి పూట వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. సాధారణంగా కింద పడిన పూలను పూజకు వాడరు. అయితే, పారిజాత పుష్పాల విషయంలో మినహాయింపు ఉంది. ఈ చెట్టు పూలు కింద పడినా, వాటి పవిత్రత ఏమాత్రం చెడదు. రాలిన పువ్వులను దేవునికి పెట్టవచ్చు కింద పడిన దోషం ఉండదు అలాగే రాలిన పువ్వులు దేవునికి పెట్టాలని కొంతమంది చెట్టు నుండి పువ్వులను దులుపుతారు ఆలా అసలు చేయకూడదు. సహజసిద్ధంగా రాలిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. ఎందుకంటే పారిజాతం పువ్వులకు నేను ఇస్తే తప్ప నా నుండి ఎవరు తీసుకోకూడదు అనే వరం ఉంది. పారిజాతం చెట్టు తపస్సు చేసి వరాన్ని పొందింది. అందువల్ల పారిజాతం పువ్వులను కింద రాలినవి ఏరి పూజ చేయటానికి ఉపయోగించాలి. అయితే కింద పడిన ఏ పువ్వు పూజకు పనికిరాదు. కానీ పారిజాతం పువ్వు మాత్రమే పూజకు పనికివస్తుంది అంతేకాక చాలా మంది పారిజాతం పువ్వులు రాలిపోతాయని చెట్టు కింద వస్త్రం చాప వంటివి వేస్తూ ఉంటారు.


ఆలా వేయకూడదు. కింద పడిన పువ్వులను మాత్రమే పూజకు ఉపయోగించాలి. అవసరమైతే పారిజాతం చెట్టు కింద ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు. పారిజాతం భూ స్పర్శ,మృత్తికా స్పర్శ,జల స్పర్శ,హస్త స్పర్శ స్వామి యొక్క స్పర్శ ఉండాలి. ఇలా 5 స్పర్శాలతో పారిజాతం పంచ మహా పాతకాలను పోగొడుతుందని శాస్త్రం చెప్పుతుంది. పారిజాతం పువ్వును అన్ని దేవుళ్ళకు పెట్టవచ్చు. పారిజాతం పువ్వుల గురించి ప్రస్తావన మనకు భాగవతంలో కనిపిస్తుంది నారదుడు పారిజాత పుష్పాన్ని తీసుకువచ్చి రుక్మిణీ దేవికి అందించడం అది చూసి సత్యభామకు కోపం రావటం ఆ కోపాన్ని తీర్చడం కోసం పారిజాతం చెట్టు ఇంట్లో నాటు తనాని కృష్ణుడి ప్రతిజ్ఞ చేయటం ఆ విధంగా దేవతలతో యుద్ధం చేసి దేవ లోకం నుండి భూలోకానికి తెచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటటం వంటి విషయాలు మనకు తెలుసు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com