ఎమ్మిగనూరు జాతరలో ఎద్దుల బలప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతు న్నాయి. నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో శనివారం న్యూ కేటగిరి విభాగంలో కర్నూలు, నంద్యాల ప్రాంతాల నుంచి 8 జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీల్లో నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి వృషభాలు నిర్ణీత సమయంలో 4,625 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.50వేలను కైవసం చేసుకున్నాయి. అలాగే నందవరం మండలానికి చెందిన జింకల మహేష్ వృషభాలు 3,900 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానంలో నిలిచి రూ.40వేల నగదును గెలుచుకోగా, నంద్యాల జిల్లా మల్యాల గ్రామానికి చెందిన షేక్‌మహమున్ని వృషభాలు 3,707.11 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచి రూ.30వేల బహుమతిని సాధించాయి. గోనెగండ్ల మండలం పెద్దనెలటూరు చెవిటి సుంకన్న వృషభాలు 3,650 అడుగుల దూరం లాగి నాలుగో స్థానంలో నిలిచి రూ.20వేలు, నంద్యాల జిల్లా పి.రుద్రవ రానికి చెందిన యల్లారెడ్డి వృషభాలు 3603.4 అడుగుల దూరం లాగి ఐదో బహుమతి రూ.10వేలను గెలుచుకు న్నాయి. పోటీల్లో గెలుపొందిన వృషభాల యజమానులకు నిర్వాహకులు నగదుతో పాటు జ్ఞాపిక అందజేసి సన్మానించారు. పోటీల సందర్భంగా వ్యాఖ్యాతలుగా చిరంజీవి, మిమిక్రి ఆర్టిస్ట్ హెచ్ .కైరవాడి ఉస్మాన్ అలరించారు. పీఈటీ లక్ష్మన్న బండలాగుడు దూరాన్ని కొలిచారు. మొదటి బహుమతిని ఫర్టిలైజర్ అసోసి యేషన్ అధ్యక్షుడు మహేంద్ర బాబు, సభ్యులు అందజేయగా మిగతావి అధికారులు, నిర్వాహకులు అందజేశారు. భాస్కర్, పార్లపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, కడిమెట్ల విరుపాక్షిరెడ్డి, రాళ్లదొడ్డి మురళికృష్ణారెడ్డి, గురురాజాదేశాయ్, గోనెగండ్ల సీఐ గంగాధర్, నందవరం ఎస్‌ఐ వి.శ్రీనివాసులు, రూరల్ ఎస్‌ఐ కె.శ్రీనివాసులు, పట్టణ ఎస్‌ఐ డాక్టర్ నాయక్‌లు పాల్గొన్నారు.