కదిరి పట్టణంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి షాపుల నిర్వహణకు అనుమతి లేదని టౌన్ సీఐ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సీఐ మాట్లాడుతూ ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన అటువంటి కొంతమంది షాపు యజమానులను గుర్తించి వారి పై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
రాత్రి పూట తాగి రోడ్ల మీద అనవసరముగా తిరిగే వారిపట్ల, మోటార్ సైకిల్స్, స్కూటీల మీద వీలింగ్ చేసే వారి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు.