రసం పీల్చు పురుగులు: కాకర మొక్క 5-6 ఆకుల దశ నుంచి రసం పీల్చే పురుగులు ఆశించడానికి అవకాశం ఉంటుంది. వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా., వేపనూనె (5 మి.లీ.)ను లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.వేరుకుళ్లు: ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపరాక్సీక్లోరైడ్ కలిపి పాదుల్లో మొక్కలకు కొంతదూరం పోయాలి.బూడిద తెగులు: ఈ తెగులు నివారణకు 125 మి.లీ.డైనోకాప్, 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారి చేయాలి.