ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్రం కాళ్ళు ముడుచుకుని కింద కూర్చుని విశ్రాంతి తీసుకోకపోవడానికి ఒక కారణం..

Life style |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 08:21 PM

సాధారణంగా భూమిపై ఉండే మేకలు కానీ, గేదెలు కానీ ఇతర ఏ జంతువులు అయినా సరే కాళ్లను ముడుచుకుని పడుకోవడం మనం చూసే ఉంటాం. ఏనుగు, ఒంటె లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నేల పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటాయి.అలా కూర్చొని అవి తమ కాలి కండరాలకు విశ్రాంతిని కలిగిస్తాయి. కానీ గుర్రం అలా నేలపై కూర్చొని ఉండటం మనం ఇంతవరకు చూసి ఉండం. గుర్రం నేలపై కూర్చొని ఉండడం చాలా అంటే చాలా తక్కువ. గుర్రం చాలా వేగంగా పరిగెత్త గల జంతువు.స్పీడ్ గా ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా అలసిపోని జంతువుగా పేరు పొందింది. ఎందుకంటే దానికి కాలి కండరాలు చాలా బలంగా శక్తితో గట్టిగా ఉంటాయి. ఎప్పుడైనా గమనిస్తే గుర్రం నిలబడి ఉన్నప్పుడు మూడు కాళ్ళ పైన బేస్ చేసుకొని నిలబడి ఉంటుంది. కానీ మనం దీన్ని ఎప్పుడూ కూడా గమనించం. ఈ విధంగా గుర్రం ఒకదాని తర్వాత ఒక కాలు కు విశ్రాంతి ఇస్తూ నిలబడి ఉంటుంది. అందుకే అది మిగతా జంతువుల లాగా కాళ్లను ముడుచుకొని కింద కూర్చుని విశ్రాంతి తీసుకోకపోవడానికి ఒక కారణం.అంతేకాకుండా గుర్రం అనేది నిలబడే నిద్రపోతుంది కూడా.. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే గుర్రం ఒక పక్కకు పూర్తిగా పడుకొని ఉంటుంది. ఒకవేళ గుర్రానికి అనారోగ్యం పాలైతే ఈ విధంగా పడుకుంటుంది. అందుకే గుర్రానికి పూర్వ కాలం నుంచి మంచి ఆదరణ ఉంది. పూర్వ కాలంలో దీన్ని పెద్ద పెద్ద యుద్ధాలలో వాడేవారు. ప్రస్తుత కాలంలో ఈ గుర్రాల జాతులు అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు మనకు తెలియదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com