అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్ఫియాలో షాపింగ్‌మాల్ దగ్గర్లో ఓ చిన్న విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానం కూలింది.ఈ ప్రమాదం వల్ల కొన్ని ఇళ్లు, కార్లూ ధ్వంసం అయ్యాయి.ఇళ్లకు దగ్గర్లోనే విమానం కూలినట్లుగా.. సోషల్ మీడియాలో విజువల్స్‌ని బట్టీ అర్థమవుతోంది.విమానం కూలిన తర్వాత.. భారీగా మంటలు చెలరేగాయి. అలాగే పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే.. రంగంలోకి దిగి.. మంటల్ని అదుపులోకి తెచ్చారు.ఈ విమనంలో ఇద్దరు ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఇది షాపింగ్ మాల్ దగ్గర్లో కూలిపోవడం వల్ల, నేలపై ఉన్న ఎవరైనా చనిపోయారా అనేది తేలాల్సి ఉంది.