కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు ఇవ్వకపోతే కళ్యాణదుర్గం రాజకీయాల నుంచి తప్పుకుంటానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. శనివారం బ్రహ్మసముద్రం మండలం ముద్దలాపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ 5సంవత్సరాల పాలనలో ఏమీ చేయలేని వారు నేడు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.