దేశీయ దిగ్గజ విమాన సంస్థ, టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిర్‌లైన్స్ ఎయిరిండియా మరోసారి బంపర్ ఆఫర్ తెచ్చింది. నమస్తే వరల్డ్ సేల్ పేరుతో సరికొత్త సేల్ తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్లపై భారీ రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. నమస్తే వరల్డ్ సేల్ టికెట్ బుకింగి ఫిబ్రవరి 2వ తేదీన మొదలైంది. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక సేల్ పీరియడ్‌లో టికెట్లు బుక్ చేసుకుని ఫిబ్రవరి 21 నుంచి అక్టోబర్ 31వ తేదీల మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని ఎయిరిండియా ఈ సందర్భంగా ఓ ప్రకటన చేసింది. ఎంపిక చేసిన రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
రూ.1499కే విమాన ప్రయాణం..
ఎయిరిండియా తీసుకొచ్చిన నమస్తే వరల్డ్ సేల్ లో భాగంగా కేవలం రూ.1499కే విమాన ప్రయాణం కల్పిస్తోంది. దేశీయ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1499 నుంచి మొదలవుతున్నాయి. అలాగే బిజినెస్ క్లాస్ అయితే రూ.9,999 నుంచి టికెట్ రేట్లు ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.12,577 నుంచి ప్రారంభమవుతుండగా.. బిజినెస్ క్లాస్ విమాన టికెట్ ధర రూ.20,870 నుంచి మొదలవుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. దేశీయంగా టూర్ ప్లాన్ చేసుకునే వారు, ఒక్కసారైనా విమానం ఎక్కాలనుకునే వారికి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. బస్ టికెట్ రేటుతోనే విమాన ప్రయాణం చేయొచ్చు.
ఎయిరిండియా అధికారిక వెబ్‌సైట్, యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకుని దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఎటువంటి కన్వినియన్స్ రుసుము సైతం వసూలు చేయడం లేదని ఎయిరిండియా తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డుల ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే కేటగిరీని బట్టి అదనపు డిస్కౌంట్ సైతం పొందవచ్చని తెలిపింది. అలాగే లిమిటెడ్ సీట్లకు, తొలుత బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్స్ వర్తిస్తాయని ఎయిర్ లైన్స్ తెలిపింది.