కదిరిలోని అడపాల వీధిలో నివాసం ఉంటున్న స్వాతి అనే మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. మృతురాలి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు అల్లుడు కేశవయ్యపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తన కూతురు స్వాతి మృతికి అల్లుడే కారణమని, ప్రతిరోజూ తాగి వచ్చి కొడుతూ, తిడుతూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు గురువారం సీఐ తెలిపారు.