ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు మార్కస్ స్టోయినిస్ ప్రకటించారు. ఆసీస్ ప్రకటించిన 15మంది జట్టు సభ్యుల జాబితాలో చోటు దక్కిన తర్వాత కూడా మార్కస్ రిటైర్మెంట్ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. 71 అంతర్జాతీయ వన్డే మ్యాచులు ఆడిన స్టోయినిస్ 1495 పరుగులు చేశారు. ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసిస్ తరపున 74 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆయన.. 1245 పరుగులు చేశారు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు చేశారు. ఐపీఎల్(IPL)లో పలు జట్ల తరపున రాణించారు. వన్డే క్రికెట్ఏ(ODI cricket) వీడ్కోలు పలికిన ఆయన.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. మరోవైపు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి రెండు వారాల సమయం మాత్రమే ఉంది. అసలే మిచెల్ మార్ష్, జోష్ హజల్‌వుడ్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆస్ట్రేలియాకు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా షాకివ్వడం చర్చనీయాంశం అవుతోంది.
![]() |
![]() |