రాష్ట్ర క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంత్రి మండిపల్లి శ్రీనివాస్, శాప్ ఛైర్మన్ రవినాయుడు విజ్ఞప్తితో క్రీడాకారులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఐదేళ్ల వైకాపా హయాంలో రూ.11.68 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రోత్సాహకాలు అందక 224 మంది క్రీడాకారులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల క్రీడాకారుల సమస్యను శాప్ ఛైర్మన్.. సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం చంద్రబాబు 189 మంది క్రీడాకారులకు రూ.7,96,62,289 విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు శాప్ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |