తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి ఎదుట ఎండిన గ్రీనరీ తగలబడిన ప్రాంతాన్ని శక్రవారం ఫోరెన్సిక్ ప్రత్యేక బృందం, జిల్లా క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గ్రీనరీ తగలబడిన విషయం విదితమే. కాగా, వైసీపీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఫిర్యాదు మేరకు జరిగిన ఘటనపై తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు కేసు నమోదు చేశారు. ఘటనా ప్రాంతాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ రవికుమార్, నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ పరిశీలించారు. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి, ల్యాబ్‌కు పంపించారు.
![]() |
![]() |