‘నాయకుడికి క్యారెక్టర్, క్రెడిబులిటీ ఉండాలి అని మాజీ సీఎం జగన్ చెప్పిన మాటలకి మోపిదేవి వెంకటరమణ స్పందిస్తూ.....‘‘మేము ప్రలోభాలకు లొంగేవాళ్లం, భయపడేవాళ్లం అవునో, కాదో నా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. అంతకంటే ముందు జగన్‌కు కూడా తెలుసు. నాకు కొత్తగా సర్టిఫికెట్ అవసరం లేదు’’ అని మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఒకవేళ భయపడే వాడినైతే జగన్‌తో పాటు కేసులో పెట్టినప్పుడే పారిపోయే వాడినన్నారు. ‘‘అన్నింటికీ తట్టుకుని ఆ రోజు నిలబడ్డా. ప్రలోభాలకు, ఒత్తిడికి లొంగి రాజకీయం చేయడం, రాజీనామాలు చేయడం అనే ఆరోపణలు అర్థ రహితం. భయపడే తత్వం నా రక్తంలోనే లేదు’’ మోపిదేవి తెలిపారు.
![]() |
![]() |