ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ 43 స్థానాల్లో, ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు అందరూ వెనుకంజలో ఉన్నారు.కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి వెనుకంజలో ఉండగా బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ముందంజలో కొనసాగుతున్నారు. దాదాపుగా 600 ఓట్లతో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలతో రమేష్ బిదూరి వార్తల్లో నిలిచారు. ఎంపీ ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా రోడ్లను మారుస్తానని..సీఎం అతిషి తన ఇంటి పేరు మార్చుకుందంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. అతిషి ఎప్పుడూ ప్రజలను కలవడానికి రాలేదని .. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆమె ఢిల్లీ వీధుల్లో అడవిలో జింక పరిగెత్తినట్లుగా తిరుగుతోందంటూ కామెంట్స్ పై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకనొక సమయంలో రమేష్ బిదూరిని తప్పించి మరోకరికి బీజేపీ టికెట్ ఇస్తుందంటూ ప్రచారం కూడా నడించింది. కానీ కౌంటింగ్ లో మాత్రం రమేష్ బిదూరి సీఎం అతిషిని వెనక్కి నెట్టి ముందంజలో కొనసాగుతున్నారు.
![]() |
![]() |