ఈ మధ్య విమాన ప్రమాదాలు కూడా రోడ్డు ప్రమాదాల్లా తరచూ జరుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో పది రోజుల వ్యవధిలోనే మూడు విమాన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవటం సర్వత్రా కలకలం సృష్టించింది. అయితే.. ఈరోజు ఒక్కరోజే మరో రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఉదయం అమెరికాలో పది మందితో వెళ్తున్న మరో విమానం అదృశ్యమవగా.. బ్రెజిల్‌లో మరో విమాన ప్రమాదం జరిగింది. బ్రెజిల్‌లోని సావో పాలోలో ఓ చిన్న సైజు విమానం ఏకంగా రోడ్డు మీద వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తుండగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అసలింతకూ.. ఆకాశంలో అందనంత ఎత్తులో ఎగరాల్సిన విమానం ఎందుకు రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టిందనేగా మీ డౌటనుమానం. కింగ్ ఎయిర్ ఎఫ్-90 అనే విమానంలో.. గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం పైలెట్ ప్రయత్నించాడు. అయితే.. సావో పాలో నగరం పశ్చిమ ప్రాంతంలోని మార్క్వెస్ డి సావో విసెంటే ప్రాంతంలో రోడ్డుపై ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా.. అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. బస్సుతో పాటు రోడ్డుపై వెళ్తున్న మిగతా వాహనాలను కూడా ఢీకొట్టినట్టు తెలుస్తోంది.
దీంతో.. విమానంలోని ఒక భాగం బస్సును ఢీకొట్టగా.. ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులో ఉన్న ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. మరోవైపు.. ఒక ద్విచక్రవాహనదారున్ని కూడా విమాన శిథిలం ఢీకొట్టటంతో అతని పరిస్థితి కూడా విషయమంగా ఉంది. ఈ ఇద్దరు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే ఘటనలో మరో నలుగురికి కూడా స్వల్ప గాయాలు కాగా.. వారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది.
సమ్‌థింగ్ ఈజ్ ఫిషీ..!
అయితే.. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలస్క, పిలిప్పిన్స్‌తో పాటు బ్రెజిల్‌లో గంటల వ్యవధిలోనే.. మూడు విమాన ప్రమాదాలు చోటుచేసుకోవటంపై పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదో తేడా కొడుతోందంటూ పోస్టులు పెడుతున్నారు.
గతేడాది కూడా ఘోర విమాన ప్రమాదం, 61 మంది మృతి
సావ్ పాలో నగరంలో గతేడాది కూడా ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న విమానం గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏకంగా 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
![]() |
![]() |