1)మేషరాశి.... (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)
ప్రారంభముల్లో మానసిక ఒత్తిడి సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ యోగ మెడిటేషన్ మొదలైంది చేయడం వల్ల మంచిది.స్నేహితుల సలహా సహకారంతో సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడానికి మీరు చేసే కార్యక్రమాలలో వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది.విద్యార్థులకు విద్యా సంబంధ అంశాల్లో రాత నైపుణ్యాలు తగిన విధంగా ఆసక్తి పెంచుకోవాలి. ఉప సనాబలం పైన శ్రద్ధ తీసుకుంటూ నైరశ్యాన్ని దూరం చేసుకుని ముందుకు సాగాలి. ఆలోచనలో ఆలస్యాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన శ్రేయోభిలాషుల యొక్క సలహా సహకారంతో సమస్యల అధికమిస్తారు.డివియేషన్సు స్నేహ సంబంధాలు వల్ల విద్యా సంబంధ ఇబ్బంది అధికంగా ఉంటాయి. . వారం మధ్యలో గవర్నమెంట్ నుంచి రావలసిన ధనాన్ని ఆకస్మికంగా అందుకుంటారు. కుటుంబంలో వ్యక్తులకి వృత్తి కొరకు అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో మిత్రులతో కలిసి ప్రయాణాలు, సరదా ప్రదేశాలకు వెళ్లడానికి అవకాశాలు. మంచి ఫలితాల కొరకు బాలాజీ మందిరాలు దర్శించడం మేలు.
2) వృషభరాశి...(కృతిక 2,3,4 పాదాలు, రోహిణి,మృగశిర 1,2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)
ఈ రాశి వారికి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు శ్రీహయగ్రీవాయనమః మంత్రాన్ని పట్టించడం చాలా మంచిది.విద్యాపరమైన నూతన విషయాలు తెలుసుకుంటారు తల్లి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు గృహవాతావరణం, ముఖ్యంగా గృహంలో చిన్నపాటి రిపేర్లు వాహనానికి సంబంధించిన అంశాలు కొంత చికాకులు కలిగిస్తుంది. అయినప్పటికీ వాటిని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళతారు వారం మధ్యలో నూతన సృజనాత్మకమైన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కొత్త విషయాలు వింటారు. ఇష్టమైన వ్యక్తుల కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉపాసన బలాన్ని పెంచుకుంటారు. వారం చివరిలోశత్రువుల మీద విజయం సాధిస్తారు నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళతారుశ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తుల సహకారంతో శ్రమ మీద పనులు సాధించుకుంటారు ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకుని వాళ్ళు చెల్లిస్తారు రోగనిరోధక శక్తిని పెంచుకుంటారు .ఇంకా మరిన్ని మంచి ఫలితాల కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ సందర్శన చాలా మంచిది
3) మిధున రాశి...(మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
వారం ప్రారంభంలో కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బందులు అధికంగా ఉంటాయి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు కోల్పోయే రీత్యా మీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలిఆత్మీయవ్యక్తుల సహకారంతో చెప్పవలసిన మాటలను చక్కగా చెబుతూ ఫలితాలు సాధించాలి. ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు అగ్రిమెంట్లు పనికిరాదు.వ్యక్తుల సహకారం తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. వారం మధ్యలో గృహ వాతావరణం వాహనాన్ని సంబంధించిన విషయాలు, సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణ విషయంలో ఆగిన పనులు కొంత చర్చకు రావడం జరుగుతుంది. ఆర్థికంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు. ఆహార స్వీకరణ, తల్లితో మాట్లాడే విషయాలు, సలహా సంప్రదింపుల విషయాల్లో తొందరపాటు పనికిరాదు. దూర ప్రదేశాలకి ప్రయాణం కొరకు అవకాశాల లభ్యమవుతాయి. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే తోబుట్టువులతో ఫోను ద్వారా ముఖ్యమైన విషయములో దీర్ఘ చర్చలు జరుపుతారు. వారం చివరిలో వృత్తి సంతానం రెండిటి యొక్క బాధ్యతల్ని చూసుకుంటూ
ముందుకువెళ్లేవిషయంలోఘర్షణఎదుర్కొంటున్నప్పటికీమీచాకచక్యంతోసమన్వయపరచుకుంటారు .సంతానం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో ఇకీభవించినందువల్ల కొంత ఉద్వేగాలకు లోనవుతారు అయినప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి.మరిన్ని మంచి ఫలితములు కొరకు దుర్గాదేవి ఆరాధన మంచిది.
4) కర్కాటక రాశి.(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) (నామ నక్షత్రములు: హి, హూ,హే, హో, డా, డీ ,డూ,డే, డో)వారం ప్రారంభంలో కుటుంబంలోని వ్యక్తులతో చర్చలు చేసి స్థిర ఆస్తుల కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం.పెట్టుబడులకి సంకల్పం.మీ ఇంటికి బంధువులు రాక. తల్లితండ్రుల సహకారంతో గృహ ప్రయత్నాలు, భూమి కొనుగోలు కొరకు ఆలోచిస్తారు.ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి రావలసినదని రావడంలో కొంత ఆలస్యాలు ఉంటాయి. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం కొంత విసుగును కలిగిస్తుంది. వారం మధ్యలో వృత్తికి సంబంధించిన విషయాలలో అవలీలగా ముందుకు వెళతారు. ఆగుతూ వస్తున్న పనులు ముందుకు పెడతాయి.సంకల్ప బలం పెరుగుతుంది కమ్యూనికేషన్ బాగుంటుంది వ్యక్తులు సహకరిస్తారు మిత్రులతో కలిసి చర్చలు చేసి నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల కొరకు ఖర్చులు అధికం చేస్తారు. మరిన్ని మంచి ఫలితాలు కొరకు దత్తాత్రేయ మందిరాలు దర్శించడం ఉత్తమము.
5) సింహరాశి...(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)వారం ప్రారంభంలోసంతానం యొక్క అభివృద్ధి అంశాలలో సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకారంతో ముందు అడుగు వేస్తారు.జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి. వృత్తిపరమైన ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లి జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని కోరిక బలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం వల్ల అందరికీ దూరంగా ఉంటారు. అయినప్పటికీ అవన్నీ మీ మనోబలంతో జయించే ప్రయత్నాలు చేయాలి.ప్రవచనాలు మొదలైన వాటి మీద ఆసక్తి అధికంగా ఉంటుంది . ఆధ్యాత్మిక ధోరణి, నైరాస్యమైన ఆలోచనలు, మీ మీద మీకు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాయిదాపడుతూవస్తున్నఎదురుచూస్తున్నధనాన్నికొంతైనాఅందుకుంటారు.విద్యార్థులకు విద్యాపరమైన వస్తువులు కొనుగోలు కొరకు ఖర్చుల అధికంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు నరసింహ స్వామి దేవాలయాలు సందర్శన మంచిది
6)కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4 పాదాలు, హస్త 4వ పాదం, చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో , పా, పి, పూ , షం , ణా, పే,పో)ప్రారంభంలో వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఆలోచనలు మొదలైన వాటి వల్ల శ్రమ, సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కొంత అనరోగ్య భావనలు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు అవసరము.ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకుంటారు వారి ఆశీస్సులు తీసుకుంటారు ట్రస్టులు మొదలైన వాటికి విరాళాలు ఇస్తారు. వారం మధ్యలో వ్యక్తిగత ఆలోచనలు బాగుంటాయి శారీరక శ్రద్ధ పెరుగుతుంది నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారం మధ్యలో మాటల వల్ల, వాగ్దానాల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి.తల్లిదండ్రుల సౌకర్యాలు కొరకు ప్రణాళికలు తీసుకుంటారు.గృహానికి వాహనానికి సంబంధించిన ఆలస్యాలు కొంత చికాకును కలిగిస్తాయి. వృత్తిపరమైన ఆదాయం అందడంలో కొంతవరకు ఆలస్యాలు చికాకును కలిగిస్తాయి.సమయానికి గవర్నమెంట్ ట్యాక్స్ చెల్లిస్తారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన మంచిది
7)తులారాశి...(చిత్త 3 4 పాదాలు, స్వాతి, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)
ప్రారంభంలో సేవలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ.వచ్చిన లాభాలను సద్వినియోగ పరచుకుని విషయంలో కూడా అనాసక్తి వైరాగ్య భావనలు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లాభాలు, ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది.మీ వారసత్వ పాస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. వారం మధ్యలో కుటుంబపరమైన ముఖ్య కార్యక్రమాలు, దైవ సందర్శన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్రలేమి ఆహార లోపం చికాకును కలిగిస్తాయి. ఇప్పటిదాకా మందకొడిగా సాగిన ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. వారం చివరిలో నూతన విషయాలు వింటారు.ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది. నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన అభివృద్ధి. సంకల్పబలం పెరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం శ్రీకృష్ణ దేవాలయ సందర్శన మంచిది.
8)వృశ్చిక రాశి...(విశాఖ 4వ పాదం, అనురాధ, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)
వారం ప్రారంభంలోఖర్చులు శక్తికి మించి ఉండడంవల్లచికాకులుపెరుగుతాయి.సమయానికి నిద్ర, విశ్రాంతి అవసరం. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది.రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి కృషి పెరుగుతుంది. మీతెలివితేటలతోవాటినిఅధిగమించగలుగుతారు. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల వృత్తిలో చికాకులు అధికం. చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం చేస్తారు. అలాంటి ఆలోచనలు నియంత్రించుకుంటూ యోగా మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. విద్యార్థులు విద్యకి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు. మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ నాయకుల యొక్క సహకారం తోడ్పాటు లభ్యమవుతుంది. ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి స్థాన చలనం కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు ముందుకు సాగుతాయి.వారం చివరిలో నూతన బాధ్యతలు అధికం.ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి మరిన్ని మంచి ఫలితముల కొరకు ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి.
9)ధను రాశి...(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)
వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి
ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సామాజిక సేవ చేస్తారు,తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం అవటం లేదని ఒక రకమైన అసంతృప్తి ఉన్నప్పటికీ మీ పుణ్య బలముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు. తండ్రి పెద్దలు గురువుల ఆశీస్సులు లభ్యమవుతాయి. . వారం మధ్యలో వృత్తికి సంబంధించి నిర్ణయాలు మార్పు చెందుతాయి, ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. రుణములు చెల్లించుటకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారం చివరిలో ఎదురుచూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ఆనందకరంగా ఉంటుంది.భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటే లాభకారంగా ఉంటాయి. మీ నిర్ణయాలు మీరు ఆశించిన రీతిలో ముందుకు వెళ్తాయి. మరిన్ని మంచి ఫలితాల కొరకు సత్యనారాయణ స్వామి దేవాలయ సందర్శన మంచిది.
10) మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భో , జా , జి, ఖి,ఖు, ఖే, ఖో, గా, గి)
వారం ప్రారంభంలో మీ కృషికి తగిన ఫలితం, నూతన వృత్తులకి అవకాశము. ఉన్నత స్థాయి వ్యక్తుల సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు నిదానమవసరం. తండ్రి యొక్క బంధువులు మీ ఇంటికి రాక,చేసే కార్యక్రమాల్లో అసంతృప్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఆటంకాలు, దూర ప్రయాణాలు, విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయాలు, విదేశీ విద్యకై ఆలోచనలు, ఆకస్మిక ధన రాబడి, భాగస్వామ్యం వ్యవహారాల్లో నూతన ఆలోచనలు, వారం చివరిలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి , ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి ప్రయాణాల విషయం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి.రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.వస్తువులని అజాగ్రత్తగా వదిలేయకూడదు ప్రయాణాలలో నూతన వ్యక్తులని నమ్ముతూ ముందుకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది.
11) కుంభ రాశి...(ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)
వారం ప్రారంభంలో సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు..సంతానముతో కలిసి వారి అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు చేస్తారుఉపాసన విషయంలో ఆటంకాలు. కుటుంబంలోని ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి. కమ్యూనికేషన్ బాగుంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం. జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక్తుల దీవెనలు అందుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విషయంలో శ్రద్ధతో నిర్ణయాలు, భాగస్వామ్య విషయాల్లో అశ్రద్ధ ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. మరిన్ని మంచి ఫలితాలు కొరకు నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది.
12) మీన రాశి...(పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) (నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)
ప్రారంభమువిద్యార్థులు శ్రమ అధికము.తల్లి తండ్రుల సలహా తోడ్పాటు.మానసిక ఆరోగ్యము శ్రద్ధ.ఆహారము కొత్త ప్రదేశాల్లో తీసుకునేటపుడు జాగర్త అవసరము. మాటలవల్ల విబేధాలు రాకుండా అచ్చి తూచి మాట్లాడాలి. దగ్గర వ్యక్తులతో ఆకస్మిక కలహాలు పనులు వాయిదాలు ఉన్న సంయమనం మంచిది. ఆరోగ్య రీత్యా తగిన జాగర్తలు అవసరం. ఉద్వేగం కోపం నియంత్రించుకోవాలి. సామజికసేవ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, పుణ్యనదీ స్నానములు,మీ సంబంధ న్యాయ విషయములపై మంతనాలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు చేసి తీర్చే ప్రయత్నాలు. శత్రువులు ఇబ్బంది చికాకులు ,రోగనిరోధక శక్తి పెంపోందించుకోవాలి. ఋణముల విషయం లో అప్రమత్తం. అనవసర స్నేహలకై వృధా ఖర్చులు, అలవాట్లు వలన ఇబ్బందులు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్ధిక సహకారము. కుటుంబములో కొంత ఆహ్లాద వాతావరణం. మరిన్ని మంచి ఫలితాములకి క్రీమ్ అత్యుతనంద గోవిందా శ్లోకాన్ని చదవటం ఈ వారము మేలు.
(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)
![]() |
![]() |