జస్ప్రీత్ బుమ్రా త్వరలోనే బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. NCAలో స్కాన్లు పూర్తయిన తర్వాత, అతని ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బోర్డు అతని పునరాగమనంపై చివరి నిమిషం వరకు వేచి ఉండే వ్యూహాన్ని అవలంబిస్తోంది. అతని గాయం తీవ్రత గురించి ఇంకా స్పష్టత రాలేదు. బుమ్రా ఇటీవల స్కానింగ్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు. అతని స్కాన్లన్నీ పూర్తయిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో భాగం కాగలడా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే, ఇప్పుడు ఒక కొత్త నివేదిక ప్రకారం బుమ్రా ఒకటి నుంచి రెండు రోజుల్లో బౌలింగ్ తిరిగి ప్రారంభించవచ్చు అని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ ప్రారంభించడానికి దగ్గరగా ఉన్నాడు. దీనితో దుబాయ్ వెళ్లాలనే అతని ఆశలు కూడా పెరుగుతున్నాయి. చూడాలి ఆ లోపు బుమ్రా ఫిట్ అవుతాడో లేదో..
![]() |
![]() |